ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కపూటే పాఠశాల పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 7.45 నుంచి 12.30 వరకే పాఠశాలలు నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలను ఇళ్లకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాఠశాలల్లో కొవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 31 నాటికి పదోతరగతి మినహా అన్ని తరగతులకు పరీక్షలు పూర్తి కావాలని విద్యాశాఖ పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలతో కలిపి జూన్ 15న ఆఖరి పనిరోజుగా నిర్ధరించారు.