ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు: మంత్రి సురేష్ - ఆదిమూలపు సురేష్ వార్తలు

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దీనికోసం బయోమెట్రిక్ సిస్టమ్​ను అప్​డేట్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Minister suresh comments on half day schools
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

By

Published : Mar 27, 2021, 9:25 PM IST

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పిల్లలు, ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అందుకోసం బయోమెట్రిక్ సిస్టమ్​ను అప్​డేట్ చేశామని వెల్లడించారు. జిల్లా అధికారులు బయోమెట్రిక్ హాజరును విధిగా తనిఖీ చేయడంతోపాటుగా పాఠశాలల్లో బయోమెట్రిక్ డివైజులు వినియోగం ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని ఆదేశించారు.

బయోమెట్రిక్ డివైజుల వినియోగంలో అవకతవకలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 'జగనన్న గోరుముద్ద'ను పిల్లలందరికీ ఒకేసారి కాకుండా కొద్ది మంది చొప్పున.. భౌతిక దూరం పాటిస్తూ వడ్డించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details