దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ను కేంద్రం రూపొందించిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. భారత అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణం వేగవంతం కానున్నాయని.. నిర్మాణాలకు రూ.80 వేల కోట్ల నిధుల పెంచారని చెప్పారు. బడ్జెట్లో పథకాలు తగ్గించి రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరిగేలా చూశారని ఆయన పేర్కొన్నారు.
"తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లేదని పాత పాట పాడుతున్నారు. అది కేంద్ర బడ్జెట్.... ఏ రాష్ట్ర ప్రస్తావన లేదు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలును మభ్యపెటొద్దు. రైతులపై ఎరువుల భారం వేసే ఆలోచన కేంద్రానికి లేదు. ఏపీ, తెలంగాణ ఫుడ్ సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల సేకరణకు ఆహరం సబ్సిడీ కేటాయింపులు పెంచింది. ఏపీకు సుమారు రూ.10 వేల కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉంది" - జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ ఎంపీ