ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాగ్రత్తలు చెబితే...కేసులు పెడతారా?: జీవీ - వైకాపా ప్రభుత్వంపై జీవీ ఆంజనేయులు కామెంట్స్

సీఎం జగన్ పై తెదేపా నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ప్రజలను కాపాడలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేంటని నిలదీశారు.

తెదేపానేత ఆంజనేయులు
తెదేపానేత ఆంజనేయులు

By

Published : May 9, 2021, 2:04 PM IST

తెదేపా నేతలపై కేసులు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి తన అసమర్థతను, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని తెదేపా సీనియర్ నేత జీ.వీ.ఆంజనేయులు విమర్శించారు. ప్రజలను కాపాడలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేంటని నిలదీశారు. నిత్యం వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నందుకు ఈ ముఖ్యమంత్రి.. ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలని ధ్వజమెత్తారు.

ప్రజలకు జాగ్రత్తలు చెబితే, చంద్రబాబుపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151సీట్లు ఇచ్చింది వారి ప్రాణాలు కాపాడతారనే తప్ప ప్రతిపక్షనేతలపై వేధింపులకు పాల్పడటానికి కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి తక్షణమే చంద్రబాబుపై, లోకేశ్, ఇతర తెదేపా నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీఎం ఇంటిని ముట్టడించి, తెదేపా సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details