ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులాన్ని ఆపాదించటం సిగ్గుచేటు' - వైకాపా ప్రభుత్వంపై జీవీ ఆంజనేయులు మండిపాటు

జగన్‌ తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు వేయడం సరికాదని తెదేపానేత జీవీ ఆంజనేయులు అన్నారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కులం ఆపాదించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Gv Anjaneyulu
Gv Anjaneyulu

By

Published : May 12, 2021, 12:24 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కులాన్ని ఆపాదించటం సిగ్గుచేటని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. "వ్యాక్సిన్ల కొనుగోలుకు ముందస్తు చెల్లింపులు చేయకుండా... ఆర్డర్లు పెట్టకుండా లేఖలకే పరిమితమయ్యారు. రూ.1600కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు అవసరమైతే కేవలం రూ.45కోట్లు మంజూరు చేసి కుల రాజకీయాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

వ్యాక్సిన్ల కొనుగోలులో ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బందులు ఏపీ ప్రభుత్వానికే ఎందుకొచ్చాయి. జగన్ రెడ్డి తన అక్రమ సంపాదనపై పెట్టే శ్రద్ధలో ఒక్క శాతం కూడా వ్యాక్సిన్ల కొనుగోళ్లు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెట్టటం లేదు. రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కోలేకనే వైకాపా నేతలు అక్రమ కేసులు బనాయించి ప్రతిష్ఠను మరింత దిగజార్చుకుంటున్నారు.

ఆక్సిజన్ అందక కరోనా రోగుల చనిపోతున్న ఘటనలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిపై కేసులు పెట్టాలి. కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి కనీసం రూ.5లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవటంతో పాటు ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి." అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి: నక్కా

ABOUT THE AUTHOR

...view details