ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

gutha sukender reddy: కేంద్రం నిర్లక్ష్యంతోనే నదీ జలాల సమస్య తీవ్రమైంది: గుత్తా

కేంద్రం అలసత్వంతోనే నదీ జలాల సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutha sukender reddy) ఆరోపించారు. 1956 నుంచే నీటి దోపిడీ జరుగుతోందని ఆయన విమర్శించారు. అప్పుడు వైఎస్​ రాజశేఖర్ ​రెడ్డి... ఇప్పుడు జగన్ అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Jun 27, 2021, 3:28 PM IST

water disputes
water disputes

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య కేంద్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యంతోనే దుర్భరంగా మారిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutha sukender reddy) ఆరోపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని విమర్శించారు.

ఇప్పుడు జగన్

నీటి దోపిడీని అప్పట్లోనే వ్యతిరేకించామని... ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణవాదులకు గౌరవం, విలువ ఇవ్వలేదని అన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దోపిడీ చేయగా... ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలను దోచుకుపోవాలనే దుర్బద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

నల్గొండ సస్యశ్యామలం

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై భాజపా వాళ్లు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసమే వారి ఆరాటమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​పై, రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే వాళ్ల పని అని విమర్శించారు.

భాజపా నాయకులు తెరాసను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిపై ప్రశ్నించరు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి... నదీ జలాలు, ఆస్తుల పంపకం, విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి... ఉత్తర కుమారుడు వచ్చారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడమే తన పని అని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారు. కాంగ్రెస్​లో సంసారం సరిదిద్దుకోవడమే సరిపోతుంది. ఆ పార్టీని అధికారంలోకి తేవడం కలలు మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ది ప్రాజెక్టును ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది.

-గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్

ఇదీ చదవండి:తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే.. ఎడారిగా ఏపీ: కొల్లు రవీంద్ర

ABOUT THE AUTHOR

...view details