నీట్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో ఎస్సీ కేటగిరీలో పి. రమ్య 739 ర్యాంకు, కిషోర్ నాయక్-1025 ర్యాంకు సాధించారు. డి. సింహాద్రి-1844, పి. వెంకటసాయి-2672, కేఆర్ రాజేశ్-2988, జి. అమూల్య-3357, ఎ. దిలీప్-4155, పి. అశోక్-4437, ఎం. మనోజ్-5257, ఎ. హరికృష్ణ-5339, ఎం. చందన-7365, పి. జయంతి-9875 ర్యాంకులు వచ్చాయి.
మొత్తం 17 మందికి వైద్య విద్య, 21 మందికి దంత విద్య ప్రవేశాలు దక్కే అవకాశముందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి హర్షవర్ధన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చిన్నటేకూరు, గోరంట్ల, ఈడుపుగల్లు కేంద్రాల నుంచి 127 మంది నీట్‌కు హాజరవ్వగా.. 104 మంది అర్హత సాధించారని వెల్లడించారు.