గుంటూరులో అరెస్టు చేసిన ఐకాస నేతలను తాడికొండ స్టేషన్‌కు తరలింపు
అరెస్టైన నేతలను పరామర్శించిన తుళ్లూరు ఐకాస నాయకులు
గుంటూరు: తాడికొండ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు, అరెస్టు
14:27 October 31
అరెస్టు చేసిన ఐకాస నేతలను తాడికొండ స్టేషన్‌కు తరలింపు
గుంటూరులో అరెస్టు చేసిన ఐకాస నేతలను తాడికొండ స్టేషన్‌కు తరలింపు
అరెస్టైన నేతలను పరామర్శించిన తుళ్లూరు ఐకాస నాయకులు
గుంటూరు: తాడికొండ స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు, అరెస్టు
14:27 October 31
అన్నదాతలకు సంకెళ్లపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఫిర్యాదు
అన్నదాతలకు సంకెళ్లపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఫిర్యాదు
ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించడం అధికార దుర్వినియోగమే: ముప్పాళ్ల
అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: ముప్పాళ్ల
బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి: ముప్పాళ్ల సుబ్బారావు
13:16 October 31
జైలు ముట్టడికి యత్నించిన ఐకాస నేతలు అరెస్టు
గుంటూరు జిల్లా జైలు ముట్టడికి యత్నించిన ఐకాస నేతలు అరెస్టు
అమరావతి రైతు ఐకాస కన్వీనర్ సుధాకర్ అరెస్టు
ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ అరెస్టు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అరెస్టు
గుంటూరు జిల్లా జైలు వద్ద దాదాపు 150 మంది అరెస్టు
అరెస్టు చేసిన వారిని తాడికొండ, నల్లపాడు పీఎస్‌లకు తరలింపు
గుంటూరు జిల్లా జైలు వద్ద అమరావతి మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
గుంటూరు జిల్లా జైలు వద్ద పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నఅర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
12:10 October 31
తుళ్లూరులో రోడ్డుపై బైఠాయించి మహిళల ధర్నా
గుంటూరు: తుళ్లూరులో రోడ్డుపై బైఠాయించి మహిళల ధర్నా
గుంటూరు: అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్
12:07 October 31
గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత
గుంటూరు జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం
జైలువైపు దూసుకొచ్చిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకులు
గుంటూరు: కారాగారం లోపలికి వెళ్లేందుకు ఐకాస నేతల యత్నం, అరెస్టు
గుంటూరు: తోపులాటలో పలువురు మహిళలకు స్వల్పగాయాలు
12:07 October 31
తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్టు
నెల్లూరు: తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్టు
నెల్లూరు: విజయమహల్ గేటు వద్ద కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అరెస్టు, ఉద్రిక్తత
12:02 October 31
చలో గుంటూరు జైలుకు ఎలాంటి అనుమతి లేదు: ఎస్పీ అమ్మిరెడ్డి
చలో గుంటూరు జైలుకు ఎలాంటి అనుమతి లేదు: గుంటూరు అర్బన్ ఎస్పీ
కొవిడ్ నిబంధనల మేరకు ముఖ్య నేతలను గృహనిర్బంధించాం: ఎస్పీ అమ్మిరెడ్డి
10 చోట్ల చెక్‌పోస్టులు, నాలుగుచోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశాం: ఎస్పీ అమ్మిరెడ్డి
మొత్తం 3 వేలమంది సిబ్బంది విధుల్లో ఉన్నారు: ఎస్పీ అమ్మిరెడ్డి
నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ అమ్మిరెడ్డి
11:57 October 31
ఉద్దండరాయునిపాలెం రైతుల అరెస్టు
చలో గుంటూరు జైలుకు వెళ్తున్న ఉద్దండరాయునిపాలెం రైతుల అరెస్టు
సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి వచ్చిన రైతులను అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించేందుకు రైతుల యత్నం, అరెస్టు చేసిన పోలీసులు
తుళ్లూరులోనూ గుంటూరు బయల్దేరిన రైతులను అడ్డుకున్న పోలీసులు
11:56 October 31
దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతోంది: యనమల
తెదేపా నాయకుల అక్రమ గృహనిర్బంధాన్ని ఖండిస్తున్నా: యనమల
శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయం: యనమల
దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపీలో అమలవుతోంది: యనమల
దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదు: యనమల
ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు: యనమల
అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం: యనమల
వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి: యనమల
10:47 October 31
గుంటూరు జైలు పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరింపు
గుంటూరు జిల్లా జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు
గుంటూరు: జైలు పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసుల ఆంక్షలు
జైలు బయట బస్టాండ్‌లో ఉన్నవారిని పంపించి వేస్తున్న పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళతో పాటు మరికొందరు అరెస్టు
10:35 October 31
మాజీమంత్రి ఆలపాటి రాజా గృహనిర్బంధం
గుంటూరు రింగ్‌రోడ్డులోని నివాసంలో మాజీమంత్రి ఆలపాటి రాజా గృహనిర్బంధం
భీమవరం: మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
భీమవరం: ఏఎంసీ మాజీ ఛైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు గృహనిర్బంధం
09:56 October 31
నేతల గృహనిర్బంధం
కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గృహనిర్బంధం
కాకినాడ గ్రామీణంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే పిల్లి ఆనంతలక్ష్మి గృహనిర్బంధం
విజయవాడ: మొగల్రాజపురంలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేత శివారెడ్డి గృహనిర్బంధం
విజయవాడ: శివారెడ్డికి నోటీసు ఇచ్చి గృహనిర్బంధం చేసిన మాచవరం పోలీసులు
09:48 October 31
గృహనిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు: చినరాజప్ప
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో చినరాజప్ప గృహనిర్బంధం
తెదేపా నాయకులు, కార్యకర్తల గృహనిర్బంధం సరికాదు: చినరాజప్ప
గృహనిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు: చినరాజప్ప
09:33 October 31
నేతల గృహనిర్బంధం
గుంటూరులో తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, నజీర్ అహమ్మద్ గృహనిర్బంధం
నెల్లూరులో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహనిర్బంధం
నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు అబ్దుల్లా అజీజ్ గృహనిర్బంధం
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గృహనిర్బంధం
చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గృహనిర్బంధం
09:22 October 31
తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే కారణంతో... సీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం తెదేపా, ఐకాస నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. అసాంఘిక శక్తులు చొరబడి ఆస్తి, ప్రాణ నష్టానికి పాల్పడతారని సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. నోటీసు ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
09:10 October 31
రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా కట్టడి చేస్తున్న పోలీసులు
చలో గుంటూరు జైలు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నాయకుల ఇళ్ల ముందు పోలీసుల మోహరించారు. ఐకాస నాయకులు, తెదేపా నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో తెదేపా నేత మన్నవ సుబ్బారావు.. తుళ్లూరులో అమరావతి ఐకాస నేత కాటా అప్పారావు.. ఎస్సీ ఐకాస నేత పులి చిన్నా.. తుళ్లూరులో అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాలకోటయ్య.. మందడంలో ఐకాస నేతలను గృహనిర్బంధం చేశారు. అలాగే.. ఐకాస ఉపాధ్యక్షుడు వీరాంజనేయులు, కోకన్వీనర్ మనోజ్.. మందడంలో మహిళా ఐకాస నేత ప్రియాంక.. మందడంలో ఎస్సీ ఐకాస నేతలు.. గుంటూరు తూర్పు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నజీర్ అహమ్మద్.. గుంటూరులోని వసంతరాయపురంలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు.. గుంటూరులో తెదేపా ఇన్‌ఛార్జులు కోవెలమూడి రవీంద్ర, నజీర్ గృహ నిర్బంధం చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
09:04 October 31
చలో గుంటూరు జైలు
రాజధాని పరిరక్షణ సమితి ఐకాస.. చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమమానికి పిలుపునిచ్చింది. అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ కార్యక్రమం చేపట్టింది. జైలులో ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి 25కిలోల బియ్యం, నిత్యావసరాలు, రూ.5 వేలు పంపిణీ చేసింది. రైతులను విడుదల చేసేవరకూ కుటుంబపోషణ తామే చూసుకుంటామని ఐకాస నేతలు ప్రకటించారు.