ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gun Firing: మాదాపూర్‌లో కాల్పుల కలకలం..ఒకరు మృతి.. కారణం అదేనా..? - gun firing in madhapur

Gun Firing in Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయపడ్డారు. స్థిరాస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Gun Firing in Hyderabad
కాల్పుల కలకలం

By

Published : Aug 1, 2022, 7:12 AM IST

Gun Firing in Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థిరాస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details