గుజరాత్‌కి చెందిన పలువురు యువతులు విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని ఓ లాడ్జిలోకి దిగారు. రెండు రోజులుగా మక్కాం వేశారు. బ్యాచ్‌లుగా విడిపోయి పట్టణ శివారు ప్రాంతాల్లోని రహదారులను పంచుకున్నారు. రోడ్లపై వచ్చే ద్విచక్రవాహనాలను ఆపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి వ్యవహారంపై స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పార్వతీపురం పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను సేకరించి.. గుజరాత్‌కి చెందిన యువతులుగా గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి.. సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
గుంటూరులోనూ హల్ చల్...
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 8 మంది యువతులు.. వసూళ్ల దందాకు తెరతీశారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో.. గుంటూరు ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను బలవంతంగా ఆపి డబ్బులు వసూలు చేశారు. ప్రతి వాహనదారుడి నుంచి.. కనీసం రు.500 ల పైబడి వసూలు చేసినట్టు.. స్థానిక ఎస్సై అశోక్‌కు సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి ఎస్సై అక్కడికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఇలాంటి వసూళ్లు చట్ట విరుద్ధమని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
ఇదీ చదవండి
గుజరాత్ యువతుల వసూళ్ల దందా.. వాహనదారులను ఆపి మరీ దబాయింపు..!