ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులపై మార్గదర్శకాలు - ts corona cases

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది.

guidelines
guidelines

By

Published : Aug 12, 2020, 10:25 PM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో సర్కారు అప్రమత్తమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఫీజుల వివరాలను ఆస్పత్రిలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని పేర్కొంది. కొవిడ్ చికిత్సకు వినియోగించే మందులకు ఎంఆర్‌పీ ధరలు వసూలు చేయాలని స్పష్టం చేసింది.

పీపీఈ కిట్‌లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో ప్రదర్శించాలంది. రోగులను డిశ్చార్జి చేసే సమయంలో సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details