ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP High Court: గ్రూప్-1పై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి..మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా - Andhra News

గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు(High Court)లో వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని న్యాయమూర్తి వాయిదా వేశారు.

గ్రూప్-1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పు రిజర్వ్
గ్రూప్-1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పు రిజర్వ్

By

Published : Jun 15, 2021, 7:46 PM IST

Updated : Jun 16, 2021, 1:44 AM IST

గ్రూప్​-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..దాఖలైన వ్యాజ్యాల్లో మంగళవారం హైకోర్టు(High Court)లో వాదనలు ముగిశాయి. ఈ నెల 17 నుంచి జరగనున్న ఇంటర్వ్యూలను నిలువరించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. ఏపీపీఎస్సీ(APPSC)తరపు న్యాయవాది వాదిస్తూ.. మూల్యాంకనంలో అక్రమాలకు తావు లేదన్నారు.

కొవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో పేపర్లు దిద్దించామని తెలిపారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో గతంలో వ్యాజ్యాల దాఖలయ్యాయి.

Last Updated : Jun 16, 2021, 1:44 AM IST

ABOUT THE AUTHOR

...view details