రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా మెరుగ్గా ఉందని రాష్ట్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. తలసరి ఆదాయమూ పెరిగిందని విశ్లేషించింది. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ర్యాంకుల్లోనూ మెరుగుపడ్డామని పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రణాళికాశాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల స్థిర ధరల వద్ద 1.58 శాతం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా ఇది మెరుగ్గా ఉందని స్పష్టం చేసింది. జాతీయ స్థూల ఉత్పత్తి -3.8 శాతం ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. 2020-21 ముందస్తు అంచనాల మేరకు ఈ గణాంకాలు పేర్కొంటున్నట్లు వివరించింది.
స్థిర ధరల వద్ద 2020-21లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215. 2019-20లోని రూ.1,68,480తో పోల్చితే రూ.1,735 పెరుగుదల ఉంది. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఇది ఎక్కువే. జాతీయ స్థాయిలో 2019-20లో తలసరి ఆదాయం రూ.1,34,186.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలివీ..
- రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల స్థిర ధరల వద్ద 1.58 శాతం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా ఇది మెరుగ్గా ఉందని స్పష్టం చేసింది. జాతీయ స్థూల ఉత్పత్తి -3.8 శాతం ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. 2020-21 ముందస్తు అంచనాల మేరకు ఈ గణాంకాలను పేర్కొంటున్నట్లు వివరించింది.
- స్థిర ధరల వద్ద 2020-21లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,70,215. 2019-20లోని రూ.1,68,480తో పోలిస్తే రూ.1,735 పెరుగుదల ఉంది. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఇది ఎక్కువే. జాతీయ స్థాయిలో 2019-20లో తలసరి ఆదాయం రూ.1,34,186.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నాలుగు నుంచి మూడుకు..
ఐక్యరాజ్యసమితి 2030 నాటికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వీటి సాధనలో దేశంలో రాష్ట్రం తన ర్యాంకును నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి మెరుగుపరుచుకుంది. 2018లో 4వ స్థానంలో ఉండగా 2019 నాటి గణాంకాలు వెల్లడించడంతో ఆ ఏడాదిలో మూడో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది. 2019 సంవత్సరానికి సంబంధించి నీతిఆయోగ్ ర్యాంకులను విడుదల చేయగా రెండు లక్ష్యాల్లో (పరిశుభ్రమైన నీరు- పారిశుద్ధ్యం శాంతి- న్యాయం) ఏపీ మొదటి ర్యాంకులో నిలిచింది. పేదరిక నిర్మూలనలో మూడో స్థానం సాధించింది. మంచి ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి వాతావరణ మార్పులు... తదితర అంశాల్లో రెండో ర్యాంకు సాధించింది. అయితే దేశం మొత్తం మీద అక్షరాస్యత 72.98 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 67.35 శాతమే ఉంది. 2019-20లో రాష్ట్రంలో 175.12 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండిస్తే 2020-21 వచ్చేసరికి అది 168.31 లక్షల టన్నులకు తగ్గింది.
నవరత్నాలే ప్రాధాన్యం..
- విద్య, వైద్యం, సామాజిక భద్రత, మహిళల సంక్షేమం, పేద అట్టడుగు వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, పరిశ్రమలు-మౌలిక సౌకర్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే ప్రభుత్వ ప్రాధాన్యాలు.
- జగనన్న అమ్మఒడి కింద 44.5 లక్షల పేద కుటుంబాల్లోని అమ్మలకు రూ.15,000 చొప్పున ఏడాదికి రూ.6,673 కోట్ల సాయం
- జగనన్న విద్యా కానుక కింద పదో తరగతి వరకు విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ
- జగనన్న గోరుముద్ద కింద 36.88 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద పోషకాహారం అందజేత
- ‘నాడు- నేడు’ కింద 15,715 పాఠశాలల్లో తొలిదశ కింద సౌకర్యాల కల్పన
- రూ.4,879 కోట్లతో 13.26 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్సుమెంటు
- జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులు 10.89 లక్షల మందికి హాస్టళ్ల వసతి
- వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.4,604.13 కోట్ల వితరణ
- కాంట్రాక్టు పోస్టులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపు
- 87,74,674 స్వయం సహాయ సంఘాలకు వైఎస్సార్ ఆసరా కింద రూ.6,792.21 కోట్ల రుణసాయం
- వైఎస్సార్ జగనన్న కాలనీలు తొలి దశలో 15.60 లక్షల నిర్మాణం.
- అన్ని రకాల పింఛన్లు కలిపి 61.73 లక్షల మందికి రూ.1,487 కోట్ల పంపిణీ
- వైఎస్సార్ రైతుభరోసా కింద ఏడాదికి రూ.13,500 (ఇందులో కేంద్ర వాటా రూ.6,000) 5.67 లక్షల మంది రైతులకు పంటల బీమా కింద రూ.1,968 కోట్ల విడుదల
కొవిడ్ వేళ.. మెరుగైన వైద్యం..
- కొవిడ్ సమయంలో మెరుగైన వైద్య సౌకర్యాలు. దేశంలో ప్రతి 10 లక్షల మందికి 2.2 లక్షల పరీక్షలు మాత్రమే చేస్తే ఏపీలో 3.3 లక్షలు చేశారు.
- కేంద్రం కేటాయించిన 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటా వినియోగించుకోవడంతో పాటు రాష్ట్రానికి 900 మెట్రిక్ టన్నులు అవసరమని కేంద్రానికి వినతి
- కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు 53.28 లక్షల మందికి, రెండు డోసులు 21.64 లక్షల మందికి ఇచ్చారు.
- ఏడాదికి రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సాయం. ఈ పథకం కింద 5,33,676 మంది రోగులు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం పొందారు.
- వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచిత కంటి శస్త్రచికిత్సల నిర్వహణ. మూడేళ్లలో అవసరమైన వారందరికీ ఆపరేషన్లు పూర్తి చేయడం
ఇవీ చదవండి:
'కరోనా దేవి'కి 48 రోజులపాటు ప్రత్యేక పూజలు!
కరోనా చికిత్స రుసుముకు కళ్లెం వేయండి: హైకోర్టు