విశాఖ మహా నగర పాలక సంస్థకు ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తెలపాలని పురపాలక శాఖను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించి ఐదేళ్లు గడిచినా మళ్లీఎన్నికలు నిర్వహించలేదంటూ కె.గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 2017 లో హైకోర్టు లో పిల్ వేశారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 45 నుంచి 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
'జీవీఎంసీ' ఎన్నికలు ఎప్పుడు? - pill
విశాఖ మహా నగర పాలక సంస్థకు ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో తెలపాలని పురపాలక శాఖను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు