ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమర వీరులకు అశ్రు నివాళులు - గాల్వన్ ఘటన

గాల్వన్​లో జరిగిన కాల్పుల్లో అమరులైన వీర జవాన్లకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. భారత్, చైనా సరిహద్దులో అసువులు బాసిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి జై జవాన్ భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.

grate condolence of indian soldiers who death galvan incident
అమర సైనికులకు అశ్రు నివాళులు

By

Published : Jun 19, 2020, 10:58 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో..

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలకు గుర్తుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. ఏలేశ్వరంలో భాజపా శ్రేణులు 'జై జవాన్ భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. రామవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, నియోజకవర్గంలోని తెదేపా నేతలు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నెల్లూరు జిల్లాలో...

నాయుడుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అమర వీరులకు నివాళులర్పించారు. కాగడాలతో ప్రదర్శన చేశారు.

కృష్ణా జిల్లాలో...

దేశం కోసం అమరులైన వీర జవాన్లకు ఎనికేపాడు భాజపా నాయకులు నివాళులు అర్పించారు. 'దేహం... నెత్తుటి మడుగుల్లో నానిపోతున్నా....నిప్పుల కొలిమి లో కాలిపోతున్నా... గొంతు మాత్రం జైహింద్ అని పలికే నిజమైన భారతీయుడే జవాన్ అని నినదించారు.

ఇదీచదవండి.

కొత్త రాజ్యసభ సభ్యులు..రాజకీయ జీవితం

ABOUT THE AUTHOR

...view details