మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా జైల్లో ఉంటున్న ఆయనకు బెయిల్ మంజూరైంది. 14 షరతులు విధించిన న్యాయస్థానం.... 28 రోజుల పాటు విజయవాడలో అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా కోర్టు ఆదేశించింది.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ - కొల్లు రవీంద్ర అరెస్టు
వైకాపా నేత హత్య కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది. 14 షరతులతో కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది.
![మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ Former minister Kollu Ravindra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8538586-112-8538586-1598267149990.jpg)
Former minister Kollu Ravindra