Vinayaka immersion: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 విగ్రహాలను నిమజ్జనం చేశారు. కడప చెరువు, సిద్ధవటం పెన్నా నది...కేసీ కెనాల్... చెన్నూరు పెన్నా నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప... ప్రజలతో కలిసి చిందులేశారు.
కల్యాణదుర్గంలో వినాయక నిమజ్జనం ఉల్లాసంగా జరిగింది. లంబోధరుడుని వీధి వీధిలో ఊరేగిస్తూ పట్టణ శివారులోని ఓకుంట చెరువులో నిమజ్జనం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. మండపాల నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి తుంగభద్రలో కలిపారు. ఈ సందర్భంగా కాల్చిన బాణసంచా అందరిని అకట్టకుంది. నెల్లూరులో గణేశ్ నిమజ్జనం పెద్దఎత్తున నిర్వహించారు. ఊరేగింపులో ఆనం సోదరుడు ట్రాక్టర్ నడిపారు. డీజే, వాయిద్యాలు, డప్పులు, సాంస్క్రతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపు జరిగింది.