ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొలిక్కిరాని మెరిట్‌లిస్ట్‌ రూపకల్పన...అభ్యర్థుల్లో ఆందోళన

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల మెరిట్‌ లిస్ట్‌లు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వల్ల... అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు విడుదలై నాలుగురోజులైంది. ధ్రువపత్రాల తనిఖీ ప్రారంభమయ్యేలోపు... మెరిట్‌ లిస్ట్‌పై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.

కొలిక్కిరాని మెరిట్‌లిస్ట్‌ రూపకల్పన...అభ్యర్థుల్లో ఆందోళన

By

Published : Sep 23, 2019, 5:29 AM IST

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి... మెరిట్‌ జాబితా విడుదలో తీవ్ర జాప్యం నెలకొంది. లక్షా 26 వేల ఉద్యోగాలకు సంబంధించి గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల మార్కులు,ర్యాంకులు వెబ్‌సైట్లో పొందుపరిచారు. జిల్లా స్థాయిలో నియామకాల కోసం... అన్ని జిల్లాలకు మెరిట్‌ లిస్ట్‌లు పంపించారు. జిల్లాలో ఉన్న పోస్టుల మేరకు... రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు ప్రకారం షార్ట్ లిస్టు తయారు చేసి ఎంపికైన అభ్యర్థులకు సమాచారం తెలియజేయాలని ఉన్నతస్థాయి అధికారులు ఆదేశించారు. తక్కువ సమయం ఉండటంవల్ల కలెక్టర్ల వద్ద మెరిట్‌ లిస్ట్‌ తయారీ ఇంకా పూర్తి కాలేదు. ధ్రువపత్రాలు పరిశీలన ప్రారంభమైనా.... జాబితా పూర్తికాకపోవడం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా కొలిక్కిరాని మెరిట్‌లిస్ట్‌ రూపకల్పన...అభ్యర్థుల్లో ఆందోళన

వెబ్ సైట్​లో పెట్టాలని అభ్యర్థుల వినతి....
ఆదివారం ఉదయంకల్లా మెరిట్‌ లిస్ట్‌ తయారవుతుందని, అభ్యర్థులు సెల్‌ఫోన్లు, మెయిల్‌ ఐడీలకు సమాచారమిస్తామని ఉన్నాతాధికారులు ప్రకటించినా... ఏ జిల్లాలోనూ అమలు కాలేదు. మెరిట్‌ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అవకతవకలు జరిగాయేమోనని అనుమానం వస్తోందని, అలాంటి వాటికి తావులేకుండా వెంటనే మెరిట్‌ లిస్ట్‌ వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉంది. మెరిట్‌ లిస్ట్‌ ఆలస్యం కావడం వల్ల... దీన్ని వాయిదా వేశారు. 25, 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. అనంతరం నియామకపత్రాలు జారీ చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details