గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగాలకు వచ్చే నెలాఖరులో రాత పరీక్షలు ఉండనున్నాయి. ప్రశ్నపత్రం తయారీ నుంచి జవాబుపత్రాల మదింపు వరకు అన్ని బాధ్యతలను ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించనుంది. మూడు, నాలుగు రోజులు పరీక్షలు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ)కి తదుపరి బాధ్యత అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన 14,061 ఉద్యోగాల కోసం గడువు ముగిసేనాటికి... రాష్ట్రవ్యాప్తంగా 11,06,614 దరఖాస్తులొచ్చాయి. కేటగిరీ-1లోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-5), వార్డు పరిపాలన కార్యదర్శి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సంక్షేమ విద్య సహాయకుల పోస్టులకు అత్యధికంగా 4.56 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
సచివాలయాల్లో 14 వేల ఉద్యోగాలు.. 11.06 లక్షల దరఖాస్తులు - latest news on gram, ward exams
గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించనుంది.

గ్రామ, వార్డు సచివాలయాల రాత పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ