రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ , ఓడరేవుల అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. ఆ దిశగా నిధుల సమీకరణకు బ్యాంకర్ల సహకారం అవసరమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ - బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ అయ్యారు. ఆరోగ్య సంరక్షణ, ఓడరేవుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. నిధుల సమీకరణకు బ్యాంకర్ల సహకారం అవసరమని సీఎస్ అన్నారు. కొవిడ్ సమయంలోనూ నిధుల కొరత లేకుండా చూసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
![బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ Govt SLBC meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11024268-412-11024268-1615863061502.jpg)
Govt SLBC meeting
రుణాల విస్తరణకు బ్యాంకులతో సమన్వయానికి ఇది కృషి చేస్తుందన్నారు. ఆరోగ్య రంగానికి 2 వేల కోట్ల రుణాలు అవసరం అవుతాయన్నారు. 2023 నాటికి.. రాష్ట్రంలో 3 ఫంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఇందుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. కొవిడ్ సమయంలోనూ నిధుల కొరత లేకుండా చూసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:తమిళనాడు ఎన్నికలకు 'ఏఐఎంఐఎం' జాబితా విడుదల