రాష్ట్రంలోని రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం.. నాబార్డుతో పాటు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి 6 వేల 400 కోట్ల రూపాయల రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని వివిధ మండలాలు, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రహదారులు, వంతెనల నిర్మాణం, మరమ్మతుల కోసం రెండు ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు చెరో 3 వేల 200 కోట్ల రూపాయల చొప్పున వ్యయం కానుంది. వీటికి ఆర్థిక సహకారాన్ని అందించేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ముందుకొచ్చింది. తొలి విడతలో 696 కిలోమీటర్ల పొడవైన రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం రూ.1,176 కోట్లను ఈ బ్యాంక్ విడుదల చేయనుంది. రాష్ట్ర వాటాగా రూ.524 కోట్లు విడుదల చేయాలి. మండల, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కోసం 546 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,212 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో రూ.840 కోట్లను న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు... రూ.360 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి.
రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రుణం పొందేందుకు అనుమతి - road development program news
రాష్ట్రంలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నాబార్డుతో పాటు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.6,400 కోట్లు తీసుకునేందుకు అంగీకరించింది.

రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రుణం పొందేందుకు అనుమతి