ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొవిడ్ వ్యాక్సిన్​ వేసేందుకు వివరాలు తయారు చేయండి' - Covid vaccination in ap news

తొలివిడతలో కొవిడ్ వ్యాక్సిన్​ను వేసేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో డేటాబేస్ రూపొందించేందుకు మండలస్థాయిలో కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వ్యాక్సిన్ రవాణా, నిల్వ, వాక్సినేషన్ కార్యక్రమం, జన సమూహాల నిర్వహణ, సమాచారం, తదితర అంశాలపై దృష్టి సారించాలని కమిటీలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది.

Govt Orders for Prepare details for Covid vaccination
'కొవిడ్ వ్యాక్సిన్​ వేసేందుకు వివరాలు తయారు చేయండి'

By

Published : Dec 2, 2020, 10:29 PM IST

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తొలివిడతలో కొవిడ్ వ్యాక్సిన్​ను వేసేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలివిడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఆ శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు వివిధ వయస్సుల వారికి టీకాను వేసేందుకు అనువుగా డేటాబేస్ రూపొందించాలని ఆదేశాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో డేటాబేస్ రూపొందించేందుకు మండలస్థాయిలో కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

తహసీల్దార్ నేతృత్వంలో 9 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో క్షేత్రస్థాయి కమిటీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కొవిడ్ టీకా వేసేందుకు స్టీరింగ్ కమిటీ, టాస్క్​ఫోర్స్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణా, నిల్వ, వాక్సినేషన్ కార్యక్రమం, జన సమూహాల నిర్వహణ, సమాచారం, తదితర అంశాలపై దృష్టి సారించాలని కమిటీలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది.

ABOUT THE AUTHOR

...view details