ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు - రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం ఆదేశాలు

సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సీఆర్​డీఏకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని.. చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. సీఆర్​డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలించాలని సూచించింది.

Govt order Crda about house pattas allocation in Amaravathi
రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

By

Published : Apr 2, 2020, 1:55 PM IST

రాజధాని పరధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూములు లేనందున రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాల్సిందిగా ఆ 2 జిల్లాల కలెక్టర్లు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాల్సిందిగా పురపాలక శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఆదేశాలు జారీచేశారు.

మాస్టర్ ప్లాన్​లో సవరణలు

2017లో జారీ చేసిన అమరావతి భూకేటాయింపుల నిబంధనల్లో భాగంగా 6.5.1 ప్రకారం రెవెన్యూ విభాగాన్ని ఓ దరఖాస్తుదారుగా పరిగణించాలంటూ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పేదలకు ఇళ్లస్థలాల కేటాయించేందుకే రెవెన్యూ శాఖ ఈ పథకాన్ని చేపట్టిందని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి సీఆర్డీఏలోని భూకేటాయింపుల నిబంధనల్లో సడలింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. మాస్టర్ ప్లాన్​లోనూ నిబంధనల ప్రకారం అవరమైన సవరణలు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ చర్యలన్నీ సుప్రీం కోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details