ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ జీవోలపై మరో అంతర్గత నోట్ - gos of ap

ప్రభుత్వ జీవోలకు సంబంధించి సోమవారం ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా మరో అంతర్గత నోట్​ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది.

Govt
Govt

By

Published : Aug 17, 2021, 2:11 PM IST

ప్రభుత్వ జీవోలను ఆన్ లైన్​లో ఉంచకూడదంటూ సోమవారం ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా మరో అంతర్గత నోట్​ను సాధారణ పరిపాలనశాఖ జారీ చేసింది. జీవోఐఆర్ వెబ్ సైట్ ను కొనసాగించనందున ప్రతీ విభాగమూ ఉత్తర్వుల జారీకి రిజిస్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోట్​లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాల శాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు.

జీవోఎంఎస్, జీవో ఆర్టీ, జీవోపీ పేరిట మూడు వేర్వేరు రిజిస్టర్లను ప్రతీ ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అత్యవసర ఆఫీసు నోట్ లో పేర్కోన్నారు. ఏపీ సచివాలయ మాన్యువల్ 2005 ప్రకారం గతంలో జారీ చేసినట్టుగానే అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఈ మూడు రకాల రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details