ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదలకిచ్చే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లకు తహసీల్దార్లే సబ్ ​రిజిస్ట్రార్లు - పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వార్తలు

ఈ ఉగాదికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తహసీల్దార్లను సబ్​ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చింది. ఇళ్ల పట్టాలు పొందే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రకటించింది.

Govt  has given new guidelines for hosing scheme
ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లకు తహసీల్దార్లే సబ్​రిజిస్ట్రార్లు

By

Published : Feb 12, 2020, 6:15 PM IST

పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణించాలని ఆదేశాల్లో పేర్కొంది.

తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా పరిగణిస్తూ జీవో విడుదల చేసింది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు వినియోగ ఛార్జీ, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి :పేదలకు జీ ప్లస్ 3 ప్లాట్లు... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details