మే నెలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జూన్ 1వ తేదీన చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19 విస్తృతి కారణంగా కేంద్రం మే 31 వరకు నాలుగు విడతలుగా లాక్ డౌన్ ప్రకటించిందని.. దీనివల్ల రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పురపాలక , శానిటేషన్ సిబ్బందికి మాత్రమే పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించగలిగామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో పాటు మళ్లీ వివిధ మార్గాల ద్వారా ఆదాయం క్రమంగా పెరుగుతున్న కారణంగా 100 శాతం వేతనాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది.
మే నెల పూర్తి జీతం వచ్చేది.. జూన్ 1నే
మే నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలకు చెందిన జీతాన్నీ వందశాతం జూన్ 1వ తేదీన చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్కు ఆదేశాలు జారీ చేసింది.
govt go on employees may month full salary