రాష్ట్రంలో వివిధ శాఖలకు, ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన నిధులు సేకరణ లక్ష్యంగా కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ఏపీఎస్డీసీ ఏర్పాటు చేస్తునట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీఎస్డీసీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.
ఒక్కో వాటా రూ.10
రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపాలకు ప్రణాళిక, నిధులు, పెట్టుబడులపై ఈ సంస్థ దృష్టి సారించనుంది. వివిధ పన్నుల వసూళ్లతో పాటు వాటి పెంపు ద్వారా ఏపీఎస్డీసీకి నిధులు సమకుర్చనున్నారు. ప్రాథమికంగా యాభై వేల ఈక్విటీ వాటాలతో సంస్థను ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో వాటా ధర రూ.10 నిర్ణయించారు. ఆరుగురు సభ్యులతో ఏపీఎస్డీసీ బోర్డు ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీచేశారు.