ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ మినహాయింపులతో ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి - govt employees attends duties news

నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ విధులకు హాజరవ్వాలనే సూచన మేరకు ఉద్యోగులందరూ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యారు. దీంతో రెండు నెలలుగా వెలవెలబోయిన కార్యాలయాల్లో కళకళలాడాయి.

govt. employees attends duties
లాక్​డౌన్ మినహాయింపులతో కళకళలాడిన ప్రభుత్వ కార్యాలయాలు

By

Published : May 22, 2020, 9:56 AM IST

లాక్​డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో రెండు నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు హాజరయ్యారు. లాక్ డౌన్ ప్రకటన అనంతరం కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు అధికారులు తక్కువ సంఖ్యలో కార్యాలయాలకు వచ్చారు.

నేటి నుంచి ఉద్యోగులందరూ తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని ఆదేశాలిచ్చింది. దీంతో పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చారు. బస్సులు అంతంత మాత్రం నడుస్తుండటంతో చాలా మంది వ్యక్తిగత వాహనాలపై వచ్చారు. విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలోని పలు ప్రభుత్వ కార్యాలయాల సముదాయం రెండు నెలల తర్వాత కళకళ లాడింది.

ప్రజా సంబంధాల శాఖ, ఆర్టీసీ ,రవాణా, సహా పలు విభాగాల ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మాస్కు ధరించటం తప్పనిసరి చేయడంతో మాస్కులతో కార్యాలయాలకు వచ్చారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే థర్మల్ స్క్రీనింగ్ చేశారు. జ్వరం లేదని నిర్థరించాకే అనుమతించారు. కార్యాలయాల్లో ఆటోమేటిక్ శానిటైజర్ యంత్రాలు ఏర్పాటుచేసి శానిటైజర్​తో చేతులను శుభ్రపరచుకున్న అనంతరమే విధులుకు హాజరయ్యారు.

కార్యాలయాన్ని సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ది చేశారు. భౌతిక దూరం పాటిస్తూ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో ఏసీని 26 డిగ్రీలకు పరిమితం చేశారు. కొన్ని చోట్లపూర్తిగా ఆపేశారు. ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరుకావడంతో అక్కడ తిరిగి సందడి నెలకొంది.

ఇదీ చదవండి:ఆ గ్రామాలకు వచ్చి మాట్లాడండి: అయ్యన్న

ABOUT THE AUTHOR

...view details