'వచ్చె నెల నుంచి 2 వేల 500 రూపాయల పింఛను వస్తుంది. ఎవరిస్తారనుకుంటున్నావ్ పింఛన్ జగన్.. తెలుసు కదా.. సీఎం గారూ.. నీకు మంజూరు చేశారు. నీ కోసం లెటర్ కూడా పంపించారు. మరిచిపోవద్దు ఆయనను. ఓటు ఎవరికేస్తావ్? జగన్‌కే వేయాలి.' ఈ మాటలు అన్నది ఏ ప్రజా ప్రతినిథో అనుకుంటే.. మీరు పొరబడినట్లే. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలివి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎంపీడీఓ చెప్పిన మాటలివి. ప్రభుత్వ అధికారిగా పని చేస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆయన తీరు.. వివాదాస్పదమవుతోంది.
పింఛన్ ఇచ్చిన జగన్‌కే ఓటేయాలమ్మా: ఎంపీడీవో ప్రచారం - వివాదస్పదమైన బ్రహ్మంగారిమఠం ఎంపీడీవో కామెంట్స్ వార్తలు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూతన పింఛన్లను పంపిణీ చేస్తూ ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లిన ఆయన.. ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించారు. అందుకు బదులుగా.. "ఇంకెవరికి? ఆయనకే వేస్తా" అంటూ సీఎం జగన్ ఫొటో చూపించింది. ఆ వెంటనే.. "మరిచిపోకమ్మా.. జగన్‌కే ఓటేయాలి నువ్వు" అంటూ.. ఆ ఎంపీడీవో చెప్పడం.. వివాదాస్పదమైంది.
పింఛన్ పంపిణీ చేస్తూ వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎంపీడీవో
Last Updated : Jun 20, 2020, 4:38 PM IST
TAGGED:
ysrcp pension scheemes news