కరోనాపై ప్రభుత్వ శాఖల కార్యదర్శుల కమిటీ నియామకం - ap government on covid virus
కరోనా నిరోధక చర్యలు, ప్రభుత్వ కార్యాచరణ పర్యవేక్షణకై వివిధ శాఖల కార్యదర్శులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ కార్యక్రమంపై ప్రభుత్వ శాఖల సమన్వయానికి కార్యదర్శుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఈ కమిటీని నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా ఆర్ధిక, రెవెన్యూ, రహదారులు భవనాలు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, హోంశాఖ, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలతో పాటు ప్రభుత్వ కార్యాచరణను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించారు.