ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం జరిగిందన్నారు. గవర్నర్ ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని తెలిపారు. తొలిసారి ఈ విధంగా నిర్వహిస్తున్నామన్న శ్రీకాంత్‌రెడ్డి.. కొవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
శాసనసభ సమావేశాలకు వచ్చే సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ, మండలిని పూర్తిగా శానిటేషన్ చేస్తున్నామన్నారు. సభ్యులు మినహా ఇతరులెవ్వరినీ అసెంబ్లీ లోనికి అనుమతిలేదని స్పష్టంచేశారు. సందర్శకులు, సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి అనుమతి లేదన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది.. బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.