బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. దీన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ వైద్య విజ్ఞాన మండలి, ఆరోగ్య పరిశోధక విభాగం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ ద్వారా ద్వారా తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించింది. పొగాకు, ఖైనీ, సుపారి తదితర పదార్థాలను వాడొద్దని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం సూచనను పరిశీలించిన సీఎం జగన్ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పొగాకు, ఖైనీ తదితర ఉత్పత్తుల నుంచి సామాన్య ప్రజానీకం దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించనున్నట్లు తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే.. కేసులే - corona effect on human lives news
కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. పొగాకు, ఖైనీ తదితర ఉత్పత్తులు బహిరంగంగా నమలడం, ఉమ్మి వేయడాన్ని నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిషేదాజ్ఞలు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే.. పోలీస్ కేసులే