రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్కో పోలీసు స్టేషన్ చొప్పున నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతుల మంజూరు చేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రూ.2.75 కోట్లతో నెల్లూరు చిన్న బజార్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ నిర్మించనున్నారు.
డీజీపీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం... మూడు జిల్లాల్లో పోలీసు స్టేషన్లు నిర్మాణం - మూడు జిల్లాల్లో పోలీసు స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి
మూడు జిల్లాల్లో ఒక్కో పోలీసు స్టేషన్ చొప్పున నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. డీజీపీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాల్లో పోలీసు స్టేషన్ల నూతన భవనాలు నిర్మించనున్నారు.
డీజీపీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం... మూడు జిల్లాల్లో పోలీసు స్టేషన్లు నిర్మాణం
రూ.1.40 కోట్లతో కడప జిల్లా పెడముదియం పోలీసు స్టేషన్ నిర్మాణానికి అనుమతి లభించింది. రూ.4.29 కోట్లతో గుంటూరు అర్బన్ కొత్తపేట పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఇదీ చదవండి :పంచాయతీరాజ్ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల