GOVT ADVISOR ON PRC: పీఆర్సీపై ముఖ్యమంత్రి ప్రకటన చేసినందున ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉందనే విషయాన్ని ఉద్యోగులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పీఆర్సీని వారంలో ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన అన్నారు. డీఏలు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని పీఆర్సీ పూర్తి చేశాక.. వాటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని.. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణలో న్యాయపరమైన వివాదాలున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు అడగకముందే సీఎం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా నిరసన తెలియచేస్తున్న ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని కూల్చాలని బండి శ్రీనివాస్ వ్యాఖ్యానించి ఉండరని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘ నేతలపై చాలా ఒత్తిడి ఉందన్నారు.
GOVT ADVISOR ON PRC: ఉద్యోగులు సంయమనం పాటించాలి
GOVT ADVISOR ON PRC: పీఆర్సీ విషయంలో ఉద్యోగులు సంయమనం పాటించాలని ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం సలహాదారు ఎన్. చంద్రశేఖర్ చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పీఆర్సీని వారంలో ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన అన్నారు.
GOVT ADVISOR ON PRC