ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GOVERNER SANKRANTI WISHES : 'ఆనందోత్సహాల నడుమ పండగ జరుపుకోవాలి' - sankranti

తెలుగు ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సంబరాలు చేసుకోవాలని సూచించారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Jan 13, 2022, 9:13 PM IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని.. తెలుగు ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆనందోత్సహాల నడుమ పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలను అనుసంధానించే పురాతన సంప్రదాయాలు, అద్భుతమైన గతానుభవాలను గుర్తుకు తెస్తూ సంక్రాంతి పండగ నూతన సంవత్సరానికి నాంది పలుకుతోందని గవర్నర్‌ అన్నారు. కరోనా ముప్పు పొంచి ఉన్నందున జాగ్రత్తలు పాటిస్తూ.. పండగ జరపుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details