ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవాగ్జిన్ కోసం వారు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: తెలంగాణ గవర్నర్ - Bharath biotech in Hyderabad

భారత్‌ బయోటెక్‌ సంస్థను తెలంగాణ గవర్నర్ తమిళిసై సందర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

governor-tamilisai
governor-tamilisai

By

Published : Sep 29, 2020, 2:46 PM IST

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలోని భారత్‌ బయోటెక్‌ సంస్థను మంగళవారం సందర్శించిన గవర్నర్‌ .. వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

కరోనా వ్యాక్సిన్‌ మీద శాస్త్రవేత్తలు ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 2020లోనే కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ కోసం అహర్నిశలు కష్టపడుతున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపేందుకే ఈ పర్యటన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details