ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వేక్సినేషన్​లో.. తెలంగాణకు రెండోస్థానం: గవర్నర్​ - గవర్నర్ తమిళసై సౌందరాజన్ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో 86,745 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండో డోస్ టీకాలు వేశారని... ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ తెలిపారు. రెండో డోస్​ ఇవ్వడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండడం సంతోషకరమన్నారు.

కరోనా డోస్ ఇవ్వడంలో తెలంగాణ రెండోస్థానం: గవర్నర్​
కరోనా డోస్ ఇవ్వడంలో తెలంగాణ రెండోస్థానం: గవర్నర్​

By

Published : Feb 21, 2021, 9:03 PM IST

కరోనా వ్యాక్సిన్​ రెండో డోస్​ ఇవ్వడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండడం సంతోషకరమని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ చెప్పారు. రాష్ట్రంలో 86,745 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండో డోస్ టీకాలు వేశారని తెలిపారు.

తెలంగాణ ఆరోగ్య శాఖకు గవర్నర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పలు చోట్ల కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని.. వైరస్​ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏ మాత్రం అజాగ్రత్త వద్దన్నారు.

ABOUT THE AUTHOR

...view details