Governor tamilisai in wellington: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్‌ను చూసేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి వైద్యులను ఆరా తీశారు. వరుణ్ తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Governor tamilisai in wellington: కెప్టెన్ వరుణ్ సింగ్‌కు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శ - గవర్నర్ తమిళిసై
Governor tamilisai in wellington: యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వరుణ్ సింగ్‌ను చూసేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులోని వెల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. వరుణ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి వైద్యులను ఆరా తీశారు.
![Governor tamilisai in wellington: కెప్టెన్ వరుణ్ సింగ్‌కు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శ తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13861577-856-13861577-1639051620976.jpg)
యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:
ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కి ఒక్క నిమిషం ముందు వీడియో