తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు మాతృ వియోగం కలిగింది. తమిళిసై తల్లి కృష్ణకుమారి(80) మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారిని రెండు రోజుల క్రితం సోమజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణకుమారి పార్థివదేహాన్ని రాజ్ భవన్ నుంచి చెన్నైకు తరలించి... అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. గవర్నర్ మాతృమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తమిళిసై కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతిచేకూరాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.