ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ గవర్నర్​కు కరోనా పరీక్షలు... ఫలితంపై తమిళిసై ట్వీట్ - corona negative for governor latest news

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాన్ని ట్వీట్ లో స్వయంగా తెలిపారు.

GOVERNOR TAMILASAI SOUNDARAJAN TESTED CORONA NEGATIVE
GOVERNOR TAMILASAI SOUNDARAJAN TESTED CORONA NEGATIVE

By

Published : Jul 12, 2020, 6:33 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. హైదరాబాద్​లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్ నెగిటివ్‌ వచ్చినట్లు ట్విట్టర్‌లో గవర్నర్‌ పేర్కొన్నారు. రెడ్‌ జోన్లలో ఉన్న వాళ్లు, వైరస్ సోకిన వారితో కాంటాక్ట్‌ హిస్టరీ ఉన్న వాళ్లు.. స్వయంగా ముందుకు వచ్చి కోవిడ్ నిర్థరణ పరీక్ష చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్.. అన్న 4టీ ఫార్ములాను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ నిర్థరణ పరీక్షలు చేయించుకునేందుకు సంశయించవద్దని.. ఇది ఎవరిని వారు కాపాడుకోవడమే కాక.. తోటివారినీ కాపాడినట్టు భావించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details