మొహర్రం త్యాగ నిరతికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వంటి అమర వీరులను మొహర్రం గుర్తు చేస్తుందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు కాగా మానవతావాదాన్ని వెలువరించే మొహర్రం స్ఫూర్తిని అనుసరించాలన్నారు. కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నివాసాలకే పరిమితమై కార్యక్రమాలను జరుపుకోవాలని గవర్నర్ సూచించారు.
త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం : గవర్నర్ - ముస్లింలకు గవర్నర్ మెుహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
ముస్లింలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మెుహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ త్యాగ నిరతీకి ప్రతీకగా నిలుస్తోందని ఆయన అన్నారు.
త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం
కరోనా వ్యాక్సిన్... వైరస్ నుంచి రక్షణను అందించటంతో పాటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని, అర్హులైన వారందరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: