హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 'హోలీ'... రంగులతో కూడిన ఉత్సాహ పూరితమైన వేడుక అని తెలిపారు. ఇది ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని , సద్భావనను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును సూచిస్తుందన్నారు. 'హోలీ' రంగులు చల్లుకునే ఆనందకరమైన వేడుకల ద్వారా జాతీయ సమైక్యతపై మన విశ్వాసాన్ని బలపరుస్తుందని తెలిపారు. అన్ని సామాజిక అడ్డంకులను అధిగమించి.. సత్యానికున్న శక్తిని, చెడుపై మంచి సాధిస్తున్న విజయాన్ని హోలీ సూచిస్తుందని గవర్నర్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు..