భరతమాత పుత్రునిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నేతాజీ 125 వ జయంతి సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ పాల్గొని నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
శాంతి మంత్రాన్ని బోస్ నమ్మలేదు..
మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా లక్షల మందిని స్వాతంత్య్ర సంగ్రామంలోకి దూసుకెళ్లారని గవర్నర్ అన్నారు. నేతాజీకి మహాత్మా గాంధీ పట్ల ఎంతో గౌరవం ఉందని.. మహాత్మా గాంధీని స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప నాయకుడిగా నేతాజీ అంగీకరించినప్పటికీ శాంతియుత నిరసనలను మాత్రం నేతాజీ నమ్మలేదన్నారు.