ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BISWABUSHAN HARICHANDAN: రాజ్యాంగ స్వేచ్ఛను.. బాధ్యతతో వినియోగించుకోవాలి: గవర్నర్

నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆస్వాదించే ప్రతిఒక్కరూ.. బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు.

BISWABUSHAN HARICHANDAN
BISWABUSHAN HARICHANDAN

By

Published : Nov 25, 2021, 10:48 PM IST

కుల, మత, వర్గాలకు అతీతంగా.. పౌరుల శాంతియుత జీవనానికి భారత రాజ్యాంగం మార్గం చూపిందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్.

భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరమూ 'సంవిధాన్ దివస్' పేరిట రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఇదే రోజున జాతీయ న్యాయ దినోత్సవాన్ని సైతం నిర్వహించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.

1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా.. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాయని గుర్తుచేశారు. ఎంతో విలువైన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆస్వాదించే ప్రతిఒక్కరూ.. బాధ్యతలను సైతం గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

Lokesh Tour in Guntur: మా పింఛను తొలగించారు.. లోకేశ్​కు విన్నవించిన బాధితులు

ABOUT THE AUTHOR

...view details