ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఎస్​ఎల్​వీ సీ-49 విజయంపై గవర్నర్, సీఎం అభినందనలు

పీఎస్​ఎల్​వీ సీ-49 రాకెట్​ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ అభినందించారు. ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

isro pslv c49
isro pslv c49

By

Published : Nov 7, 2020, 5:16 PM IST

Updated : Nov 7, 2020, 6:36 PM IST

శ్రీ హరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్)‌ నుంచి పీఎస్ఎల్‌వీ సీ-49 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి.

శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటంపై ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మన దేశానికి చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుందని... ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయులని అన్నారు.

Last Updated : Nov 7, 2020, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details