ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రకటన జారీ చేశారు. అది మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, 17 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే.
వైద్య బిల్లుల చెల్లింపు కొనసాగించండి
ఉద్యోగులు, పింఛనుదార్లకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగింపు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 7 నెలలుగా వైద్య చికిత్స బిల్లులకు ఆమోదం దక్కక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో వాపోయారు.
ఇళ్ల స్థలాలకు గనుల భూములు
ఖనిజ తవ్వకాలకు కేటాయించిన భూములను దీర్ఘకాలికంగా వినియోగించకుండా ఉంటే... వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ ఆదేశించింది. వీటిల్లో అనుకూలమైన వాటిని ఇళ్ల స్థలాల పంపిణీ, ఇతర ప్రజావసరాలకు ఉపయోగించాలని సూచించింది.
పట్టణాల మెరుగుకు రూ.5,350 కోట్లు
పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల మెరుగుకు రూ.5,350.62 కోట్ల సవరించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది.
27 నుంచి పరిశుభ్రత పక్షోత్సవాలు
మనం, మన పరిశుభ్రతలో భాగంగా ఈనెల 24 నుంచి ఆగస్టు 15వరకు గ్రామాల్లో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ ప్రకటించారు.
శాసనసభ, మండలి ప్రొరోగ్ - legislative and legislative council meetings
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రకటన జారీ చేశారు.
శాసనసభ, మండలి సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ ప్రకటన జారీ
ఇదీ చదవండి: