ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం ఆవశ్యకం: గవర్నర్ - సాయుధ దళాల పతాక దినోత్సవం వార్తలు

దేశ రక్షణలో అసువులు బాస్తున్న సాయుధ దళాల సిబ్బందిని స్మరించుకోవటం ఆవశ్యకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తమ అత్యున్నత సేవల ద్వారా భారతీయ సాయుధ దళాలు దేశ పౌరుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని అన్నారు.

governor biswa bhusan harichandan
governor biswa bhusan harichandan

By

Published : Dec 7, 2020, 4:37 PM IST

విజయవాడ రాజ్​భవన్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతావని రక్షణలో వీర మరణం పొందిన సాయుధ దళాల కుటుంబ సభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. సాయుధ దళాల సిబ్బందికి, వారి కుటుంబాలకు పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని అస్థిరపరిచే బాహ్య శక్తులను నిలువరిస్తూ తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయిధ దళాలను అభినందించేందుకు పతాక దినోత్సవం మంచి సందర్భమన్నారు.

దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన విశాఖపట్నంకు చెందిన సమ్మింగి తులసీరామ్ భార్య రోహిణికి గవర్నర్ నగదు పురస్కారాన్ని అందించారు. పతాక దినోత్సవ నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా సహకారం అందించడానికి అంగీకరించడం అభినందనీయమని కొనియాడారు. సాయుధ దళాల పతాక నిధికి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన అధికారులను గవర్నర్‌ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details