ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Venue for swearing ministers: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార వేదిక ఎక్కడ? - ఏపీ తాజా వార్తలు

Venue for swearing ministers: ఈ నెల 11 తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రమాణస్వీకారానికి మరో మూడు రోజుల సమయం ఉండటంతో సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.

Venue for swearing ministers
ప్రమాణ స్వీకార వేదిక ఎంపికపై కసరత్తు

By

Published : Apr 7, 2022, 2:47 PM IST

Venue for swearing ministers: ఈ నెల 11 తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి వేదికను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రమాణ స్వీకార వేదికను సచివాలయం వెలుపల ఏర్పాటు చేయాలా? లేక విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించాలా? అన్న దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. తొలుత సచివాలయంలోని రెండో బ్లాక్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే.. స్థలాభావం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండటంతో అసెంబ్లీ గేటు ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలోనే నిర్వహించాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరో మూడు రోజుల సమయం ఉండటంతో.. ఈ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details