ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

loan for sc farmers: ఎస్సీ రైతులకు ప్రకృతి రుణం

loan for sc farmers: ఎస్సీ రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలను ఇవ్వనుంది. ఒక్కో రైతుకు రూ.50వేల రుణాన్ని అందించనున్నారు. సాగుపరంగా మరింత రుణం అవసరమైతే ఆ మేరకు ఇస్తారు. ఇందులో రూ.10వేలు రాయితీగా ఉండనుంది.

ఎస్సీ రైతులకు ప్రకృతి రుణం
ఎస్సీ రైతులకు ప్రకృతి రుణం

By

Published : Jan 5, 2022, 8:51 AM IST

loan for sc farmers: ఎస్సీ రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలను ఇవ్వనుంది. ఒక్కో రైతుకు రూ.50వేల రుణాన్ని అందించనున్నారు. సాగుపరంగా మరింత రుణం అవసరమైతే ఆ మేరకు ఇస్తారు. ఇందులో రూ.10వేలు రాయితీగా ఉండనుంది. రాయితీపోనూ మిగతా రుణాన్ని వాయిదాల్లో చెల్లించాలి. సూక్ష్మ రుణ ప్రణాళిక ప్రకారం రుణ మంజూరు ఉండనుంది. రైతు కుటుంబాల్లోని మహిళలకు రుణాన్ని ఇస్తారు. కౌలు రైతులకూ వర్తిస్తుంది.

ఎస్సీ కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుండగా.. రైతు సాధికార సంస్థ, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (ఉన్నతి, స్త్రీనిధి)ల సహకారంతో ఈ రుణాలను అందిస్తారు. రాయితీ రుణాల మంజూరుకు లబ్ధిదారుల ఎంపికను ఎస్సీ కార్పొరేషన్‌ ప్రారంభించింది. రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 40వేల మందికి రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత కింద జనవరి నెలాఖరునాటికి 9వేల మందికి రుణాలిస్తారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి మిగతా 31వేల మందికి రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. పండిన పంటకు రవాణా, మార్కెటింగ్‌ సదుపాయం కల్పనకుగాను ట్రాలీ ఆటోలను రాయితీపై ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి:KABADDI : తిరుపతిలోనూ కబడ్డీ కూత!...5 రోజులూ జాతీయస్థాయి మజా

ABOUT THE AUTHOR

...view details