Solo Meters: కొత్త విద్యుత్ కనెక్షన్లపై అభివృద్ధి ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా విభాగాలవారీగా ధరలు పెంచనుంది. 500 యూనిట్ల వరకూ వినియోగమున్న కనెక్షన్లకు 800 రూపాయల అభివృద్ధి ఛార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. ఇక వెయ్యిలోపు యూనిట్లు వినియోగిస్తే....15 వందల రూపాయల మేర అభివృద్ధి ఛార్జీలుగా వసూలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 3 డిస్కమ్‌లు పంపిన ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ అంగీకరించింది. ఒక ఇంటికి ఒకే మీటర్ ఏర్పాటుపైనా ఇంధనశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టాయి.
Solo Meters: కొత్త విద్యుత్ కనెక్షన్లపై అభివృద్ధి ఛార్జీలు! - solo meters in andhraprdesh
Solo Meters: విద్యుత్ పంపిణీలో ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది..! త్వరలోనే ఒక ఇంటికి ఒకే మీటర్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం..! ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే ఇంటికి రెండు మీటర్లున్న కొన్ని ఇళ్లకుఇప్పటికే ముందస్తు నోటీసులిచ్చారు.
ఒక ఇంటికి 2 విద్యుత్ మీటర్లు కలిగిన కొన్ని ఇళ్లకుఇప్పటికే నోటీసులిచ్చినట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒక విభాగానికి సంబంధించిన మీటర్లు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే. అలాంటివాటిని తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల మారిన టారిఫ్‌లతో ఒకే మీటర్ విధానం అమలుతో ఎక్కువ ఆదాయం రాబట్టుకోవచ్చనేది డిస్కమ్‌ల ఆలోచన. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల వసూలుపై అభ్యంతరాలు రావడంతో..ఆ నష్టాలు పూడ్చేందుకు ఇదే మంచి తరుణమని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక ఇంట్లో విద్యుత్ ఎక్కువగా వినియోగించే ఉపకరణాల కోసం ప్రత్యేకంగా మీటర్లు బిగించుకుంటున్నారన్న ఫిర్యాదులతోనే ఒక మీటర్ విధానంపై దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తరహా వ్యవహరంతో డిస్కంలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో మీటర్లు ఉన్న ఇళ్లను గుర్తించి...అలాంటి వారందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. త్వరలోనే స్మార్ట్ మీటర్లు రానున్న నేపథ్యంలో...ఇంటికో మీటర్ అంశం పరిశీలించాలని ఇంధన శాఖ యోచిస్తోంది.
ఇదీ చదవండి:Omicron Cases: రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు